![]() |
![]() |
తెలుగు ఇండియన్ ఐడల్ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఒక ఇంటరెస్టింగ్ యంగ్ సింగర్ వచ్చాడు. 16 ఏళ్ళ సాయి అనీష్ కందాడ..స్కాట్ ల్యాండ్ నుంచి వచ్చి పెర్ఫార్మ్ చేసాడు. ఇక అతనితో పాటు అతని తల్లి కూడా స్టేజి మీదకు వచ్చారు. ఇక అనీష్ రాగానే థమన్ కూడా సరదాగా మాట్లాడారు. ఎక్కడినుంచి వచ్చావ్ అని అడగడంతో స్కాట్ ల్యాండ్ అన్నాడు. గ్లాస్కోనా అని థమన్ అడిగేసరికి కాదు ఎడిన్బర్గ్ అని చెప్పాడు. తర్వాత వాళ్ళ అమ్మ ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలి అంటూ చెప్పారు. కార్తీక్ సర్ మీకు గుర్తుందో లేదో కానీ మీరు ఒకసారి మాంచెస్టర్ లో అనీష్ ని కలిశారు అని గుర్తు చేసింది. కార్తీక్ కూడా అవును 2022 మార్చ్ కదా అని చెప్పేసరికి అవును అన్నారు ఆవిడ. మీరు ఒక ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు. నేను నిన్ను ఇండియన్ ఐడల్ లో చూస్తాను అని..మీ ఆటో గ్రాఫ్ ని ఫ్రేమ్ చేయించి తన గదిలో భద్రంగా పెట్టుకున్నాడు. ఇక ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇండియన్ ఐడల్ కి వచ్చేసాడు అని చెప్పారు. దాంతో కార్తీక్ కూడా ఫుల్ హ్యాపీ అయ్యాడు. అనీష్ నేను చెప్పినట్టే చివరికి అనీష్ ఇండియన్ ఐడల్ కి వచ్చావ్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ రైట్ అంటూ ఎంకరేజ్ చేసాడు. ఇక అనీష్ వాళ్ళ అమ్మ తన బిడ్డ ఆటిస్టిక్ కిడ్ అని. మాటలు సరిగా రావు అని చెప్పుకొచ్చారు. కానీ సంగీతం అంటే ప్రాణం పెడతాడు. దయచేసి నన్ను అర్ధం చేసుకోండి. నాకు కొంచెం నెర్వస్ నెస్ ఉంది, టెన్షన్ కూడా ఉంది అని చెప్పారు. దాంతో థమన్ మీరు కంగారు పడొద్దు. మీరు మీ అబ్బాయి ప్యాషన్ కోసం ఇంత దూరం తీసుకొచ్చారు. మాకు మీ మీద చాల రెస్పెక్ట్ ఉంది అని భరోసా ఇచ్చారు. ఇక అనీష్ ఐతే రామా కనవేమిరా అనే సాంగ్ ని అద్భుతంగా పాడి వినిపించాడు. ఇక గీత మాధురి ఐతే ఎవరు పాడితే రాముడు వస్తాడో రాడో తెలీదు కానీ నీ పాటకు రాముడు వచ్చాడు విన్నాడు అంటూ అనీష్ పాటను మెచ్చుకుంది. ఇక కార్తీక్ ఐతే చాలా బాగా పాడావు..ఈ రాగమో తెలుసా అనేసరికి రీతి గౌళ రాగం అని చెప్పాడు అనీష్. ఆ రాగం అంటే తనకు ఎంతో ఇష్టం అని చెప్పాడు కార్తీక్. ఇక అనీష్ కి ఒక బిగ్ ఆఫర్ ఇచ్చాడు. "మేమెవ్వరం కూడా ఎస్ అని నో అని కానీ చెప్పము. నువ్వు చాలా గొప్పవాడివి. అందుకే నీకోసం ఒక ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తున్నాం. నువ్వు ఇండియాలో ఎప్పటి వరకు ఉంటావో అప్పటి వరకు తెలుగు ఇండియన్ ఐడల్ షోకి నువ్వు వచ్చి నీకు ఇష్టమైన పాట పాడొచ్చు" అని చెప్పాడు. తరువాత అనీష్ కీబోర్డ్ ప్లే చేయాలి అని కోరగానే కార్తీక్ తీసుకెళ్లి కూర్చోబెట్టడంతో పాటు "ఎదుట నిలిచింది చూడు" అనే సాంగ్ ని అనీష్ తో కలిసి పాడి అతన్ని సంతోషంగా పంపించాడు.
![]() |
![]() |